శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో భక్తులు, సత్రం సిబ్బంది గొడవ పడిన దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకల పాలెం గ్రామానికి చెందిన నలుగురు భక్తులు మంగళవారం సాయంత్రంలో భోజనం చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వడ్డింపు విషయమై సత్రం సిబ్బందికి, నలుగురు భక్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో సూపర్ వైజర్ కందిమల్ల శ్రీనివాసరావు(59) కింద పడిపోయారు. సత్రం సిబ్బంది హుటాహుటిన శ్రీశైల దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని దండమూడి గ్రామవాసిగా గుర్తించారు. శ్రీశైలం సీఐ బి.వి. రమణ, ఎస్సై హరి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
శ్రీశైలం సత్రం వద్ద ఘర్షణ...సీసీ కెమెరాలో దృశ్యాలు - Supervisor dies at Srisailam Kakatiya Kamma satram
శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో భక్తుల దాడిలో సూపర్ వైజర్ మృతి చెందిన ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. భోజన విషయమై భక్తులకు, సత్రం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది.
![శ్రీశైలం సత్రం వద్ద ఘర్షణ...సీసీ కెమెరాలో దృశ్యాలు Srisailam Attack CC Footage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10055433-383-10055433-1609309778424.jpg)
సీసీ కెమెరాలో దృశ్యాలు