కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలు వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో అగసనూరులో.. ఆకాశ్ రెడ్డి నామినేషన్ పత్రాలను.. మరో వర్గంవారు చించేశారు. అలాగే చిర్తనకల్ నామినేషన్ కేంద్రం వద్ద.. చింతకుంటకు చెందిన నాగలక్ష్మిని నామినేషన్ వేయకుండా.. ప్రత్యర్థులు అడ్డుకున్నారని ఆమె తరఫు కార్యకర్తలు ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు వచ్చాకే.. పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు దగ్గరుండి నాగలక్ష్మి చేత నామినేషన్ వేయించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణలు... అదుపు చేసిన పోలీసులు - కోసిగి మండలంలోని నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణలు న్యూస్
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణలు ఘర్షణలు తలెత్తాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నాక పరిస్థితి అదుపులోకి వచ్చింది.
![నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణలు... అదుపు చేసిన పోలీసులు Clashes at nomination centers in Kosigi zone of Kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10572055-969-10572055-1612958786707.jpg)
నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణలు... అదుపు చేసిన పోలీసులు...