కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కల్లుబావి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 24వ వార్డులో వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి డబ్బులు పంచుతుండగా.. సీపీఎం అభ్యర్థి అడ్డుకున్నారు. ఇరుపార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. వైకాపా నేతలు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.
ఆదోనిలో ఉద్రిక్తత... వైకాపా, సీపీఎం నేతల మధ్య ఘర్షణ - ycp news in adoni
కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైకాపా అభ్యర్థి డబ్బులు పంచుతుండగా.. సీపీఎం నేతలు అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు.
ఆదోనిలో వైకాపా, సీపీఎంల మధ్య ఘర్షణ