ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ జంట పరారీ... ఇరు కుటుంబాలు ఘర్షణ - kurnool district crime news

ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. ప్రేమికులు గ్రామం విడిచి వెళ్లిపోవటంతో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు... అబ్బాయి కుటుంబంపై దాడి చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

lovers escaped
lovers escaped

By

Published : Aug 24, 2020, 4:36 PM IST

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వేరువేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి... ఆదివారం గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీనితో కోపోద్రిక్తులైన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు... అబ్బాయి కుటుంబంపై దాడి చేశారు. నలుగురిని గాయపరిచారు. రెండు ఇళ్లను ధ్వంసం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details