కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురంలో రెండు వర్గాలవారు శనివారం ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన శరణప్ప, మహాలక్ష్మి దంపతులకు 11 ఎకరాల భూమి ఉంది. తాము పొలంలో పనులు చేస్తుండగా సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన పలువురు రైతులు భూ విషయంలో గొడవకు దిగి దాడికి పాల్పడ్డారంటూ బాధితులు శనివారం పోలీసులకు తెలిపారు.
శరణప్ప, మహాలక్ష్మి, షణ్ముక, నరసింహులుకు గాయాలవగా చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి వెళ్లారు. మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ధనుంజయ పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు.