సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం....సీజేఏ జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారిగా శ్రీశైలంలోని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు... దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితుల మంత్రాల నడుమ ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.
CJI NV RAMANA: శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సీజేఐ ఎన్.వి.రమణకు పూర్ణకుంభంతో ఈవో, అర్చకులు స్వాగతం పలికారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీజేఐ
ఇటీవల దేవస్థానం ప్రచురించిన స్కంధ పురాణంలోని శ్రీశైలం ఖండ మూలప్రతిని పరిష్కరించి... సంస్కృతంలో మూలగ్రంథాన్ని తెలుగులో శ్లోక భావాలతో రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన శ్రీత్రిష్టి లక్ష్మీ సీతారామాంజనేయ శర్మను సీజేఏ సత్కరించారు. ఘంటమఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను నిశితంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:
పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇస్తే.. బిడ్డకూ రక్ష
Last Updated : Jun 18, 2021, 9:44 PM IST