కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన కులదీప్ సివిల్స్‌లో 135వ ర్యాంకు సాధించారు. దీంతో కులదీప్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నవిశ్వేశ్వరయ్య, రాజరాజేశ్వరిల సంతానం కులదీప్. అసోంలోని ఎన్‌ఐటిలో బీటెక్ పూర్తి చేశారు. గతేడాది సివిల్స్‌లో ఐపీఎస్ సాధించి రెండో విడత శిక్షణలో అహ్మదాబాద్‌లో ఉన్నారు. తమ కుమారుడికి మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
సివిల్స్ లో 135వ ర్యాంకు సాధించిన కులదీప్.. తల్లిదండ్రుల్లో ఆనందం - సివిల్స్ లో 135వ ర్యాంకు సాధింటిన కులదీప్
సివిల్స్ లో 135వ ర్యాంకు సాధించారు కర్నూలు వాసి కులదీప్. గతేడాది సివిల్స్ లో ఐపీఎస్ సాధించి రెండో విడత శిక్షణలో ఉన్నారు. ఇప్పుడు 135 వ ర్యాంకు సాధించడంపై కులదీప్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

civils ranker
సివిల్స్ లో 135వ ర్యాంకు సాధించిన కులదీప్