ఇచ్చిన ఇళ్ల పట్టాలకు వెంటనే స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దిన్నెదేవర గ్రామ హమాలి వర్కర్స్ నిరసన చేపట్టారు. గ్రామానికి చెందిన దాదాపు 400 మందికి... 2013లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కానీ.. స్థలాలను కేటాయించలేదు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్య పరిష్కారం కావడంలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల పట్టాలు ఇచ్చారు... కేటాయింపు మరిచారని నిరసన - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడుకు చెందిన 400 మందికి 2013లో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పట్టాలు అందజేసింది. ఇప్పటికీ స్థలాలు చూపించలేదు. ఈ విషయంపై.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదట నిరసనకు దిగారు.
స్థల కేటాయింపు మరిచారని నిరసన