కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం భూముల్లో వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు, వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. వైద్యకళాశాలను మరో చోట నిర్మించాలన్నారు.
నంద్యాలలో ప్రభుత్వ భూమి తక్కువగా ఉంది. మంజూరైన పలు అభివృద్ధి పనులకు భూమి కొరత ఉంది. ప్రస్తుతం వైద్యకళాశాల నిర్మాణానికి ఇదే సమస్య ఎదురవుతున్న క్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములను కేటాయించాం. -ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి