100 రోజులుగా వ్యవసాయ కార్మికుల ఆందోళన - సెంచరీ పూర్తి చేసిన వ్యవసాయ కార్మికుల ఆందోళన
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో.. వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మికులు ఆ ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు. నేటితో వంద రోజులను పూర్తి చేసుకుంది.
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మికులు చేస్తున్న ఆందోళన వంద రోజులకు చేరుకుంది. పరిశోధనా స్థానం ఎదుట నూరు సంఖ్య ఆకారంలో వ్యవసాయ కూలీలు కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని పెట్టి కార్మికులు ధర్నా చేశారు. వీరి నిరసనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.