ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బనగానపల్లెలో ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం - నందవరంలో చౌడేశ్వరి దేవి రథోత్సవం వార్తలు

బనగానపల్లె మండలం నందవరంలో చౌడేశ్వరి దేవి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రథంలో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుక ప్రారంభించారు.

banaganepalli chowdeawari rathostavam
బనగానపల్లెలో ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం

By

Published : Apr 18, 2021, 6:52 AM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో చౌడేశ్వరీ దేవి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రథంలో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవం ప్రారంభించారు.

ఆలయ ఛైర్మన్ పీఆర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఈఓ రామానుజన్ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందివర్గం పోలీసులు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details