కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ప్రైవేటు చిట్ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఎక్కవ వడ్డీ, తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి.. కస్టమర్లను మోసం చేసింది. సుమారు 300 మంది ఖాతాదారులు యాజమాన్యం చేతిలో మోసపోయారు. రెండు రోజుల నుంచి కార్యాలయం మూసివేసి ఉండటాన్ని ఖాతాదారులు గుర్తించారు. సుమారు 5 వేల నుంచి 2 లక్షల వరకు డబ్బులు కట్టామని.. కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తాము మోసపోయామని సంస్థపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
ఖాతాదారులకు చిట్ఫండ్ కంపెనీ కుచ్చుటోపీ - police station
ఆదోనిలో ఓ ప్రైవేటు చిట్ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. యాజమాన్యం చేతిలో సుమారు 300 మంది కస్టమర్లు మోసపోయారు.
చిట్ఫండ్ కంపెనీ మోసం