ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీరంగనాథస్వామి సన్నిధికి చినజీయర్ స్వామి - చినజీయర్ తాజా న్యూస్

కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి శ్రీరంగనాథస్వామిని చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. మరోసారి స్వామివారి దర్శినానికి వచ్చేటప్పుడు ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంటానని అన్నారు.

Chinjiyar visited Peravali Sriranganathaswamy in Kurnool district
పెరవలి శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న చినజీయర్

By

Published : Jan 18, 2021, 9:18 PM IST

కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి శ్రీరంగనాథస్వామి ఆలయానికి త్రిదండి చినజీయర్ విచ్చేశారు. స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా పేర్కొన్నారు. 3 వేల సంవత్సరాల క్రితమే స్వామివారు పెరవలిలో వెలిశారని చెప్పారు. 14 వ శతాబ్దంలోనే నిర్మించిన ఈ ఆలయాన్ని, కాపాడుకుంటూ వస్తున్నవారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంటనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వర్థంతి.. నివాళులర్పించిన నేతలు

ABOUT THE AUTHOR

...view details