ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాంబార్​లో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనపై విచారణ - kurnool student death invetigation

కర్నూలు జిల్లా పాణ్యంలో సాంబార్ పడి విద్యార్థి మృతి చెందిన ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు విచారణ చేపట్టారు.

విద్యార్థి మృతిపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ విచారణ

By

Published : Nov 16, 2019, 7:36 AM IST

విద్యార్థి మృతిపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ విచారణ
కర్నూలు జిల్లా పాణ్యం విజయ నికేతన్ ఉన్నత పాఠశాలలో సాంబారు పాత్రలో పడి యూకేజీ విద్యార్థి పురుషోత్తంరెడ్డి మృతి చెందిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు రాజేశ్వరమ్మ శుక్రవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదులు, వంటగది, భోజన శాల తదితర విషయాలను తనిఖీ చేశారు. పాఠశాల నిబంధనల ప్రకారం నడుచుకోవటం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేశ్వరమ్మ, రాష్ట్ర కమిషన్​కు నివేదిక పంపనున్నట్లు తెలిపారు.

సంబంధిత కథనాలు:కర్నూలు జిల్లాలో విషాదం... సాంబారులో పడి విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details