అల్లరి చేశాడని.. ప్రాణం తీశాడు - boy murderd by man in kurnool
అల్లరి చేస్తున్నాడంటూ మూడేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కర్నూలులో జరిగింది. దెబ్బలు భరించలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు మృతి చెందాడు.
![అల్లరి చేశాడని.. ప్రాణం తీశాడు childern murderd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6602732-439-6602732-1585598820316.jpg)
అల్లరి చేస్తున్నాడంటూ మూడేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేశాడు
అల్లరి చేస్తున్నాడంటూ మూడేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేశాడు
కర్నూలు నగరంలో దారుణం చోటుచేసుకుంది. అల్లరి చేస్తున్నాడన్న కారణంతో విచక్షణ రహితంగా కొట్టడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఫరూక్.. ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అల్లరి చేస్తున్నాడంటూ ఆమె కుమారుడుని ఫరూక్ విచక్షణ రహితంగా కొట్టడం వల్ల బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.