కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో అఖిలబాయి (9) అనే చిన్నారి మృతి చెందింది. చాగలమర్రి మండలం ముత్యాలపాడు తండా గ్రామానికి చెందిన అఖిలబాయ్ ని.. తేలు కుట్టింది. చికిత్స నిమిత్తం రాత్రి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా...అక్కడ చనిపోయింది.
వైద్యులు నిర్లక్ష్యంగా వల్లే మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు....ఆస్పత్రి ఎదుట చిన్నారి మృతదేహంతో ధర్నా చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.