ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లైన 20 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ.. బలి తీసుకున్న ఆటో - ఆటో ఢీకొని చిన్నారి మృతి

పిల్లల కోసం ఆ దంపతులు సంప్రదించని వైద్యులు లేరు.. మొక్కని దేవుడు లేడు... అలాంటి వారికి 20 సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పుట్టింది. లేకలేక పుట్టిన చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విధి వక్రీకరించింది. పట్టుమని నాలుగేళ్లు కూడా నిండకుండానే ఆ పాపను మృత్యువు ఆటో రూపంలో కబలించింది. ఈ విషాధ ఘటన కర్నూలు జిల్లా సంజామల మండలం కానాల గ్రామంలో జరిగింది.

child died by hitting auto at karnool district, kanala
పెళ్లైన 20 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డను బలి తీసుకున్న ఆటో..

By

Published : Jan 9, 2021, 8:21 PM IST

కర్నూలు జిల్లా సంజామల మండలం కానాల గ్రామంలో విషాదం జరిగింది. ఆటో ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వెంకట లచ్చమ్మ కుమార్తె శృతి దుకాణానికి వెళ్లి తినుబండారాలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో శృతి అక్కడికక్కడే మరణించింది. శ్రీనివాసులు, వెంకట లచ్చమ్మ దంపతులకు.. శృతి 20 ఏళ్ల తర్వాత పుట్టింది. శృతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంజామల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో ఢీకొని చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details