కర్నూలు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. చాగలమర్రి చెంచుగూడ వద్ద గత ఐదు రోజులుగా ఎర్రవంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనివల్ల కల్వర్టు తెగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా తిండి గింజలు కూడా లేవని చాగలమర్రి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానందిలో భారీ వర్షాలు కారణంగా పాలేరు రాళ్ల వాగు ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఫలితంగా మహానంది క్షేత్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవరం మండలం ఆలమూరు వద్ద వాగులో హర్షద్ అనే బాలుడు గల్లంతయ్యాడు.
చాగలమర్రి వాగు ఉద్ధృతం... ఇబ్బందుల్లో జనం - heavy rains in kurnool district
కర్నూలు జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలేరు రాళ్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల మహానంది క్షేత్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. గత ఐదు రోజులుగా ఎర్రవంక వాగు ప్రవాహం విపరీతంగా పెరిగింది. దీనివల్ల చాగలమర్రి గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి.
చాగలమర్రి వాగు