ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా.. అక్రమ ఇసుక, మద్యం రవాణాను అడ్డుకున్న పోలీసులు - kurnool district cheap liquor caught latest news

జిల్లాలోని వివిధ చోట్ల జరిగిన సోదాల్లో అక్రమ మద్యం, ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్​లు, ట్రాక్టర్​ను సీజ్​ చేసి... నిందితులను కోర్టులో హాజరు పరిచారు.

cheap liquor and illegal sand mining caught by police in kurnool district
జిల్లాలో అక్రమ మద్యం చేస్తున్న వారిని అరెస్ట్​ చేసిన పోలీసులు

By

Published : Jun 18, 2020, 12:01 PM IST

కర్నూలు జిల్లాలో అక్రమ ఇసుక, మద్యం రవాణా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పుల్లూరు చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనాలపై తెలంగాణ మద్యం తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 53 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో... కర్నూలు నగరంలో బైక్​పై 9 మద్యం సీసాలు, 60 నాటుసారా ప్యాకెట్లు తీసుకెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఉలిందకొండ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కొల్లంపల్లి తాడంలో నాటుసారా అమముతున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు. హంద్రీ నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్​ను సీజ్​ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details