ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడోరోజు శ్రీభ్రమరాంబా దేవి భక్తులకు చంద్ర ఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై కొలువైన చంద్రఘంటాదేవికి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్లను రావణ వాహనంపై అధిష్టింపజేసి ధూప,దీప, నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు చేశారు.పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు మంగళవాయిద్యల నడుమ ఆలయ ఉత్సవం నిర్వహించారు.
చంద్ర ఘంట అలంకారంలో శ్రీశైల భ్రమరాంబా దేవి - చంద్ర ఘంట అలంకారంలో శ్రీశైల భ్రమరాంబికా
శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడోరోజు శ్రీభ్రమరాంబా దేవి భక్తులకు చంద్ర ఘంట అలంకారంలో దర్శనమిచ్చారు.

చంద్ర ఘంట అలంకారంలో శ్రీశైల భ్రమరాంబా దేవి