ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా విధానాలతో రాష్ట్రం దివాళా: చంద్రబాబు - వైసీపీపై చంద్రబాబు ఫైర్

వైకాపా విధానాలు ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. గత ఐదేళ్లలో తెదేపా సృష్టించిన పెట్టుబడుల అనుకూల పరిస్థితులను వైకాపా నాశనం చేస్తుందని విమర్శించారు. వైకాపా టెర్రర్ వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రావడం లేదని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలపై దాడులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

chandrababu tours to kurnool
వైకాపా విధానాలతో రాష్ట్రం దివాలా : చంద్రబాబు

By

Published : Dec 4, 2019, 7:11 PM IST

Updated : Dec 4, 2019, 9:14 PM IST

కర్నూలులో మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు

తెదేపా శ్రేణులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కర్నూలులో మాట్లాడిన ఆయన... తెదేపా కార్యకర్తలపై... వైకాపా దాడులు చేసి, మానసికంగా కుంగదీస్తున్నారన్నారు. ఎమ్మిగనూరులో ఓ యువకుడి ఉద్యోగం తీసివేసి తప్పుడు కేసు పెట్టారని చంద్రబాబు అన్నారు. కొడుకు ఉద్యోగం పోయిందన్న బాధ తట్టుకోలేక యువకుడి తండ్రి చనిపోయారని చంద్రబాబు ఆవేదన చెందారు. వైకాపా చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెదేపా శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

దివాళా దిశలో రాష్ట్రం
వైకాపా పరిపాలన ఇలానే కొనసాగితే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని చంద్రబాబు ఆరోపించారు. ముందు ముందు అప్పులు పుట్టే పరిస్థితి కూడా ఉండదన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు సంపద సృష్టించేందుకు అనుకూలమైన వనరులు సృష్టించామన్న ఆయన.. 7 నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. వైకాపా పాలన వల్ల సీడ్ క్యాపిటల్‌, సోలార్ హబ్‌ దెబ్బతిన్నాయని తెదేపా అధినేత స్పష్టం చేశారు. జగన్ టెర్రర్ వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రావడం లేదని ఆరోపించారు.

ముడుపుల కోసమే మద్యం ధరలు పెంపు
వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చే ఆదాయం 25 నుంచి 30 శాతం తగ్గిందని చంద్రబాబు విమర్శించారు. వైకాపా చేతగానితనం వల్ల కిలో ఉల్లి రూ.110కి చేరిందన్నారు. ఉల్లి ధర పెరిగినా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. జె-టాక్స్, వైకాపా నేతల ముడుపుల కోసమే మద్యం ధర 150 నుంచి 200 శాతం పెంచారని ఆరోపించారు. బెల్ట్ షాపులు ఇంటికొకటి తయారయ్యాయన్న చంద్రబాబు.. తెలంగాణ, తమిళనాడు నుంచి మద్యం రాష్ట్రానికి అక్రమంగా వస్తుందన్నారు. కల్తీ మద్యం ఎక్కువై ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు.

ఆర్థికవృద్ధితిరోగమనం
ఇసుక పేరుతో వైకాపా నేతలు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు ఇసుక తరలిపోతోందన్నారు. ఆన్‌లైన్‌, స్టాక్ పాయింట్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పోలీసు ఎస్కార్ట్ పెట్టి ఇసుక వాహనాలను తరలిస్తున్నారన్నారు. ఇసుక కొరతతో.. సిమెంట్‌, స్టీల్‌, ఇతర అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయన్నారు. నిర్మాణ పనులు నిలిచిపోయి ఆర్థికవృద్ధి తగ్గిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లాపోయాయన్నారు.

ఇదీ చదవండి : అధైర్య పడకండి... అండగా ఉంటా !

Last Updated : Dec 4, 2019, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details