ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో చంద్రబాబు పర్యటన - ఆంధ్రప్రదేశ్​ న్యూస్​ లైవ్​

CHANDRABABU TOUR IN KURNOOL: పార్టీ బలోపేతం సహా జగన్ పాలనను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. దీని కోసం ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు.. ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించటం సహా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడనున్నారు.

CHANDRABABU TOUR IN KURNOOL
CHANDRABABU TOUR IN KURNOOL

By

Published : Nov 15, 2022, 7:25 PM IST

Updated : Nov 16, 2022, 6:50 AM IST

CBN THREE DAYS TOUR IN KURNOOL: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. దీని కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. 12 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

అనంతరం కోడుమూరు, కరివేముల, దేవనకొండ మీదుగా రోడ్డు మార్గంలో పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం పత్తికొండలో రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం కోరమాండల్ ఫర్టిలైజర్ ప్రాంతంలో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు.. గురవారం పట్టణంలో రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఎమ్మిగనూరులో రోడ్డు షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు.

రాత్రికి కర్నూలులో బస చేసి.... శుక్రవారం ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను తెలుగుదేశం నేతలు పరిశీలించారు. పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పర్యటన పార్టీ శ్రేణులు, కర్నూలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, భరోసాను తీసుకొస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 16, 2022, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details