మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 4 వ తేదీన కర్నూలులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పంచలింగాల టోల్ గేట్ వద్దకు చేరుకుంటారని.. 3 గంటల పాటు పాత నగరంలోని కింగ్ మార్కెట్ నుంచి ప్రచారం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పాత బస్టాండ్, ఘోషాసుపత్రి, ఎస్టీబీసీ కాలేజ్ రోడ్డు, మౌర్య ఇన్ హోటల్, బంగారు పేట, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్ వరకు రోడ్డు షో సాగుతుందని చెప్పారు. అభివృద్ధి కావాలంటే తెదేపాని గెలిపించాలని మరో నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి కోరారు.
రేపు కర్నూలులో చంద్రబాబు పర్యటన - కర్నూలు తాజా వార్తలు
రేపు కర్నూలులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో తెదేపా నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొనున్నారు.
చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడిస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు