ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CBN LETTER TO DGP: హత్య కేసులో సాక్షులకు బెదిరింపులు.. డీజీపీకి చంద్రబాబు లేఖ - ఏపీ తాజా వార్తలు

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో జూన్‌ 17న నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. సాక్షుల్ని బెదిరిస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని లేఖలో కోరారు. నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదన్న చంద్రబాబు.. బాధితుల కుటుంబ సభ్యులు, సాక్షులను బెదిరిస్తున్నారని.. నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి సాక్షులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

CHANDRABABU
CHANDRABABU

By

Published : Aug 1, 2021, 2:10 PM IST

సాక్షుల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న జంట హత్యల దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జూన్ 17న వడ్డు నాగేశ్వర్​రెడ్డి, వడ్డు ప్రతాప్​రెడ్డిలను వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వారి సోదరుడు మోహన్ రెడ్డికి నివాళులు అర్పించడానికి శ్మశానవాటికకు వెళ్లినప్పుడు వైకాపా నాయకులు వారిని హత్య చేశారని ధ్వజమెత్తారు.

ఇలాంటి హింసాత్మక చర్యలకు సమాజంలో చోటు ఉండకూడదన్నారు. నిందితుల్ని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బాధితుల కుటుంబ సభ్యులను, సాక్షులను దోషులు ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి సాక్షులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: RRR movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్​.. 'దోస్తీ' సాంగ్​ వచ్చేసింది​

ABOUT THE AUTHOR

...view details