Certificate of Commitment: కర్నూలు సర్వజనాస్పత్రిలోని.. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం లభించింది. కొవిడ్ మొదటి దశ సమయంలో ఆయన అందించిన వైద్య సేవలు, వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందకుండా అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా.. సర్టిఫికెట్ ఆఫ్ కమిట్‌మెంట్ అవార్డు దక్కింది.
విపత్కర సమయంలో ఎంతో ధైర్యంగా డాక్టర్ చంద్రశేఖర్ అందించిన సేవలకు ఈ అవార్డు ప్రకటించినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ జాయింట్ సెక్రెటరీ, సౌత్ ఇండియా ఇంఛార్జ్ ఎలియాజర్ తెలిపారు. తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.