మహానందిలో కేంద్ర బృందం పర్యటన - central team visited mahanandhi
మహానంది ఆలయాన్ని కోవిడ్-19 కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. తిమ్మాపూర్ గ్రామాన్ని పరిశీలించి అక్కడి ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కలిగించాలని వైద్యులకు సూచించారు.
ఆలయాన్నిసందర్శిస్తున్న కేంద్ర బృందం
కర్నూలు జిల్లా మహానంది అలయాన్ని కోవిడ్-19 కేంద్ర బృందం సభ్యులు డాక్టరు మధుమిత ధూభే, డాక్టరు సంజీవ కుమార్, సాదుఖాన్ సందర్శించారు. కరోనా దృష్యా ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు, ఆవరణలో క్యూలైన్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకంటే ముందు మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో పర్యటించి.. అక్కడ వైద్యులతో కరోనాపై చర్చించారు.
ఇదీ చదవండి:'కరోనా సమయంలో కరెంటు బిల్లులు పెంచటం శోచనీయం'