కర్నూలు జిల్లా నంద్యాలలో కోవిడ్ -19 కేంద్ర బృందం పర్యటించింది. పట్టణంలోని ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కరోనా పాజిటివ్ కేసులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని బైటిపేట ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం నంద్యాల మండలంలోని చాపిరేవుల గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ వసతులను పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమతి ధూభే, డాక్టరు సంజయ్ కుమార్ సాదుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో కోవిడ్-19 కేంద్రబృందం పర్యటన - kurnool dst corona cases
కోవిడ్ - 19 బృందం కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించింది. పట్టణంలో కరోనా కేసుల వివరాలను బృంద సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
![నంద్యాలలో కోవిడ్-19 కేంద్రబృందం పర్యటన cental kovid team vistists kurnool dst to get details about corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7167075-498-7167075-1589278774250.jpg)
cental kovid team vistists kurnool dst to get details about corona cases