కర్నూలు జిల్లా అవుకులో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహంలో ఆయన పార్థీవదేహాన్ని ఉంచారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానంద రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.. ప్రజలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. చల్లా రామకృష్ణారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
అవుకులో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డికి ప్రముఖుల నివాళులు - అవుకులో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పార్థీవదేహానికి నివాళులు తాజా వార్తలు
కరోనాతో మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డికి ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కర్నూలు జిల్లా అవుకులోని ఆయన స్వగృహంలో పార్థీవదేహం ఉంచారు.

అవుకులో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డికి ప్రముఖుల నివాళులు
మొదటిసారిగా 1983లో పాణ్యం నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1999, 2004లో కోయిలకుంట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి.కరోనాతో ఎమ్మెల్సీ, వైకాపా నేత చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత