కర్నూలు నగరంలో కరోనా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని సీసీఎస్ డీఎస్పీ వినోద్ కుమార్ కోరారు. అనవసరంగా బయటకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి... కేసులు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. రెడ్ జోన్, హై అలర్ట్ రిస్క్ జోన్లలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు... భౌతిక దూరం పాటించాలని... మాస్కులు ధరించాలని చెబుతున్న డీఎస్పీతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.
లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కేసులు తప్పవు: డీఎస్పీ వినోద్ - కరోనాను నివారించాలంటే భౌతిక దూరం పాటించాలి
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీసీఎస్ డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. కరోనా రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
![లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కేసులు తప్పవు: డీఎస్పీ వినోద్ ccs dsp vinod kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6842598-106-6842598-1587206259839.jpg)
డీఎస్పీ వినోద్ కుమార్తో ముఖాముఖి