ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విభిన్నంగా ఆలోచించాలి.. అద్భుతాలు సృష్టించాలి: లక్ష్మీనారాయణ - CBI Ex JD Laxminarayana

విద్యార్థులు భిన్నంగా ఆలోచించి అద్భుతాలు సృష్టించవచ్చని మాజీ ఐపీఎస్, జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కర్నూలు నగరంలో జరిగిన ఇంపాక్ట్-2019 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

By

Published : Jul 25, 2019, 10:30 PM IST

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విద్యార్థులు విభిన్నమైన ఆలోచనలతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించవచ్చని జనసేన నేత, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలు నగరంలో జరిగిన ఇంపాక్ట్-2019 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. చంద్రయాన్-2 ప్రయోగ ముఖ్య లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. చంద్రమండలంలో ఉన్న హీలియంతో ఎలాంటి కాలుష్యం లేకుండా... 10 వేల సంవత్సరాల పాటు విద్యుత్‌ సరఫరా చేయవచ్చని చెప్పారు. సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చేందుకు చంద్రయాన్ - 2 పరిశోధన ఉపయోగపడుతుందని లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details