ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CBI CASE ON SPY AGRO: నంద్యాల ఎస్పీవై ఆగ్రో కర్మాగారంపై సీబీఐ కేసు నమోదు - ap news

CBI CASE ON SPY AGRO: బ్యాంకును మోసం చేసిన అభియోగంతో.. కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో కర్మాగారంపై హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో సీబీఐ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది.

cbi case on spy Agro
cbi case on spy Agro

By

Published : Dec 2, 2021, 8:57 PM IST

CBI CASE ON SPY AGRO: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన కంపెనీ.. బ్యాంకును మోసం చేసిన అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎం.శశిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. రుణాల పేరిట రూ. 61 కోట్ల 86 లక్షల మోసం చేశారంటూ.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 'తప్పుడు పత్రాలు, వివరాలు సమర్పించి నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రుణాలు పొంది.. వాటిని ఇతర అవసరాలకు మళ్లించి వ్యక్తిగత లబ్ధి పొందిన అనంతరం ఎగవేశారు' అని బ్యాంకు ఆఫ్ బరోడా ఆరోపణ.

దివంగత ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు సురేష్, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో కర్మాగారంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇదీ చదవండి.. :NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

ABOUT THE AUTHOR

...view details