తనకు కరోనా సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఓ వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వైద్యుడు.. తనకు కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో వచ్చిందంటూ ఓ న్యాయవాదితో పాటు మరికొందరు అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. వీరిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన సీఐ కంబగిరి రాముడు.. విచారణ చేస్తామన్నారు.
'నాకు కరోనా వచ్చిందని ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - nandyal latest corona news
నంద్యాలకు చెందిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. తనకు కరోనా సోకిందంటూ.. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.
సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసినందుకు కేసు నమోదు