కర్నూలు జిల్లాలో ఈరోజూ రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 25 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ బులిటెన్లో రాష్ట్రంలో మొత్తం 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రకటించారు.
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - new
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రం మెుత్తం మీద నేడు కొత్తగా 67 కేసులు నమోదు కాగా... అందులో ఒక కర్నూలు జిల్లాలోనే 25 కేసులు నమోదయ్యాయి.
67 కేసుల్లో కూడా జిల్లా నుంచి 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 491 మందికి కరోనా సోకగా... అందులో 395 చికిత్స పొందుతున్నారు.86 మంది కోలుకొగా.. 10 మంది మృతి చెందారు.