కర్నూలు సర్వజన వైద్యశాలలో.. హృద్రోగ చికిత్స కొసం రోగులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. రెండు వారాలుగా ఇక్కడ గుండె శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. హార్ట్ లంగ్ యంత్రాన్ని నిర్వహించే పర్ఫ్యూజనిస్టు గౌస్ బాషాకు గత నాలుగు నెలలుగా జీతాలు అందని కారణంగా... ఆయన విధులకు హాజరు కావటం లేదు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సురేష్‌ను డయాలసిస్ విభాగానికి బదిలీ చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవటం వల్ల... చాలా కాలంగా ఆపరేషన్లు నిలిచిపోయాయి. చివరిసారిగా గత నెల 28వ తేదీన గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. ఇప్పటికే కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగంలో నలుగురు హృద్రోగులు ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆగిన గుండె శస్త్ర చికిత్సలు - కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆగిన గుండె శస్త్ర చికిత్సలు
కర్నూలు జిల్లాలోని సర్వజన వైద్యశాలలో గుండె శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. కొన్ని నెలలుగా జీతాలు అందని కారణంగా.. వైద్యులు విధుల్లోకి హాజరవ్వటం లేదు. ఫలితంగా హృద్రోగులు శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్న హృద్రోగులు