కర్నూలు నగరంలోని బంగారుపేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతూ అదుపు తప్పి రెండు ఆటోలను ఢీకొట్టింది. డివైడర్ని దాటి రోడ్డు పక్కనున్న ఓ దుకాణం వైపు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు ఢీకొనడం వల్ల దుకాణం స్వల్పంగా ధ్వంసం అయ్యిందని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం కారు చోదకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు బీభత్సం.. మహిళకు గాయాలు, రెండు ఆటోలు ధ్వంసం - కర్నూలు నగరంలో ప్రమాదం వార్తలు
కర్నూలులో కారు సృష్టించిన బీభత్సానికి రెండు ఆటోలు ధ్వంసమయ్యాయి. ఓ మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది. దుకాణం స్వల్పంగా దెబ్బతింది. ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు బీభత్సం