car accident: బావిలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి! - kurnool latest news
![car accident: బావిలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి! బావిలోకి దూసుకెళ్లిన కారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14429020-597-14429020-1644500839328.jpg)
18:08 February 10
బావిలోకి దూసుకెళ్లిన కారు
car accident: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామం వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరు ఉన్నట్టు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు, క్రేన్ సాయంతో బావిలో నుంచి కారును బయటకు తీశారు. ఆయితే.. అందులోని వ్యక్తి అప్పటికే మృతిచెందారు. మృతుడు కోడుమూరుకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు.
ఇదీ చదవండి: