Car Caught in Fire : కర్నూలు జిల్లాలోని సోమాయాజులపల్లెలో కారు మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. నంది డెయిరీ ఎండీ వికాస్రెడ్డి కుంటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి నంద్యాలకు కారులో బయల్దేరారు. కారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెకు చేరుకొగానే.. ఘాట్రోడ్డులోని కిలోమీటర్ రాయిని కారు ఢీకొట్టింది. ఈ సమయంలో కారు వేగంగా ఉండటంతో కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారు అప్రమత్తమై.. బయటకు దిగటంతో ప్రాణ నష్టం తప్పింది. రహదారి సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం - కీసర టోల్గేట్
Car Caught in Fire : కర్నూలు జిల్లాలో మంటల్లో చిక్కుకుని కారు దగ్దమైంది. వేగంతో వెళ్తున్న కారు ఘాట్రోడ్డులోని కిలోమీటర్ రాయిని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని మరో ప్రమాదంలో టైరు పంక్చర్ కావటంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
పల్టీలు కొట్టిన కారు: ఎన్టీఆర్ జిల్లా కంచిచర్ల మండలంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరిన కారు.. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం కీసర వద్దకు రాగానే, ముందు టైర్ పంక్చర్ కావటంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలపాలయ్యారు. కీసర టోల్గేట్ అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: