కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిల క్షేత్రం వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందిన సుబ్బయ్య(45) అహోబిలంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిల క్షేత్రం వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టటంతో బైక్ పైన వ్యక్తి మృతి చెందాడు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.
car and bike accident in kurnool dst one died