Kodumuru Car Accident కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. బైక్ను తప్పించబోయిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు జిల్లా తుగ్గలి నుంచి కారు బయలుదేరి నంద్యాల జిల్లా అలగనూరుకు వెళ్తుండగా కోడుమూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యలమరాజు(50) అతని కుమారుడు ఎల్లనారాయణ(23), మరో వ్యక్తి వెంకటస్వామి(60) ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ రాఘునాయక్ తీవ్రంగా గాయపడగా.. అతనిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రీకుమారులు నంద్యాల జిల్లా అలగనూరు వాసులు కాగా వెంకటస్వామి కర్నూలు జిల్లా కృష్ణగిరికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
బైక్ను తప్పించబోయి కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి - Kodumuru Bike Accident
Three died in Car Accident: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి నంద్యాల జిల్లాకు బయల్దేరిన కారు ప్రమాదానికి గురవటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి గల కారణమేంటంటే..
కారు ప్రమాదం
Last Updated : Nov 30, 2022, 6:15 PM IST