కొవ్వొత్తుల ర్యాలీ... అమరులైన రైతులకు నివాళి - ఎమ్మిగనూరు వార్తలు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసనలు చేస్తూ మరణించిన అన్నదాతలకు... కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.
candle rally
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దిల్లీలో ఆందోళన చేస్తూ అసువులు బాసిన రైతులకు నివాళులు అర్పించారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని నినదించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ... కేంద్రం మొండివైఖరి వీడాలన్నారు.