ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలుకు నీళ్లు ఇవ్వాలని కోరితే హై కోర్టును ఇస్తారా?: బైరెడ్డి

సీఎం జగన్​కు చంద్రబాబుపై పగ సాధించడం తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. కర్నూలుకు నీళ్లవ్వాలని అడిగితే హైకోర్టు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమను ప్రధాని దత్తత తీసుకోవాలని కోరారు.

Byreddy rajashekar reddy demands water for kc canal
కర్నూలు ధర్నాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి

By

Published : Feb 12, 2020, 10:01 PM IST

కేసీ కెనాల్​ నీరు విడుదల చేయాలని భాజపా నిరసన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు చంద్రబాబుపై పగ తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టడంలేదని అన్నారు. కేసీ కెనాల్​కు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కర్నూలు జలమండలి కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. కర్నూలుకు నీళ్లవ్వాలని అడుగుతుంటే హైకోర్టు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రాయలసీమలో రెండు వందల టీఎంసీల జలాశయం కట్టాలని కోరుతూ ప్రధానికి లేఖ రాస్తామని చెప్పారు. రాయలసీమను ప్రధాని దత్తత తీసుకోవాలని బైరెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details