Byreddy House arrest : కర్నూలులో రాయలసీమ గర్జన నిర్వహించిన ఎస్టీబీసీ కళాశాల మైదానంలో పాలతో శుద్ధి చేసే కార్యక్రమానికి భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. రాయలసీమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని.. ముడున్నర సంవత్సర కాలంలో రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని బైరెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు ఎందుకు చేపట్టలేదని బైరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందుకే వైఎస్సార్ సీపీ నాయకులు రాయలసీమ నినాదాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
రాయలసీమ గర్జన శుద్ధి కార్యక్రమానికి పిలుపు.. బైరెడ్డి గృహ నిర్బంధం - కర్నూలులో బీజేపీ నేత హౌస్ అరెస్టు
Byreddy House arrest : భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కర్నూలులో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని..ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఆరోపించారు.
గృహ నిర్బంధం