శ్రీశైల దేవస్థానం ఆర్జిత సేవల టికెట్ల అక్రమాల్లో తిమింగళాలను వదిలేసి... చిన్నచిన్న చేపలను పట్టుకున్నారని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం శ్రీశైలంలో మాంసం లభ్యమైందన్నారు. వైకాపా ప్రభుత్వం శ్రీశైలంలోని సంప్రదాయాలను ఏమైనా మార్చారా అని ఆయన ప్రశ్నించారు.
'వైకాపా ప్రభుత్వం హిందూ సంప్రదాయాలని కించపరుస్తోంది' - News on srisailma ticket scam
వైకాపా ప్రభుత్వం హిందూ సంప్రదాయాలని కించపరిచేలా వ్యవహరిస్తోందని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శ్రీశైల దేవస్థానం ఆర్జిత సేవల టికెట్ల అక్రమాల్లో అసలైన వారిని వదిలేసి.. చిన్నచిన్న వారిని పట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
శ్రీశైల టికెట్ల అక్రమాలపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
వైకాపా ప్రభుత్వం హిందూ సంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న వ్యవహారాలపై సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు.
ఇదీ చదవండి: శ్రీశైలం దేవస్థానం టికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరం