ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నమ్మించి మోసం చేశారు: బుట్టా రేణుక - tdp

కర్నూలు లోక్​సభ స్థానంపై తనతో ఒక్క మాట చెప్పకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఎంపీ బుట్టా రేణుక ఆవేదన చెందారు. కేడర్ లేదని సీటు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు.

మీడియాతో ముచ్చటిస్తున్న బుట్టా రేణుక

By

Published : Mar 20, 2019, 8:02 PM IST

మీడియాతో ముచ్చటిస్తున్న బుట్టా రేణుక
కర్నూలు లోక్​సభ నియోజకవర్గంవిషయంలో తనతో ఒక్క మాటచెప్పకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఎంపీ బుట్టా రేణుక ఆవేదన చెందారు. తెదేపాలోకి కోట్ల సూర్య ప్రకాశ్​రెడ్డివచ్చిన అనంతరం సీఎంనుకలిసినా... టిక్కెట్​ కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.కేడర్ లేదన్న కారణం చెబుతూతనకు సీటు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు. నమ్మించి జగన్ ఆశయంలో భాగస్వామిగా మారి వైకాపా గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు.

గత ఎన్నికల్లో కర్నూలు లోక్​సభస్థానానికి వైకాపా తరఫున పోటీ చేసి విజయం సాధించిన రేణుక.. అనంతరం తెదేపాలోకి చేరారు. తాజాగా తెదేపా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రేణుకకు చోటు దక్కలేదు. కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాశ్​ను తెదేపా బరిలోకి దింపింది. ఈ పరిణామంతో అలకబూనిన రేణుక... ఈ నెల 16న వైకాపా గూటికి చేరారు.

ABOUT THE AUTHOR

...view details