కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గంలో వేర్హౌస్ గోడౌన్ యజమాని ప్రహ్లాద శెట్టి ఆనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ప్రహ్లాద శెట్టి.. రైతుల నుంచి పప్పు శనగలను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన డబ్బు రైతులకు చెల్లించకుండా రూ.50 కోట్లకు ఐపీ పెట్టాడు. ఈ క్రమంలో ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైతులు... వ్యాపారి ఇంటి ముందు ఆందోళన చెపట్టారు. నగదు చెలించి దహన సంస్కారాలు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... రైతులకు సర్ది చెప్పారు. డబ్బులు ఇవ్వనిపక్షంలో తాము ఆత్మహత్య చేసుకుంటామని రైతులు తేల్చి చెప్పారు.
వేర్హౌస్ గోడౌన్ యజమాని మృతి.. డబ్బు చెల్లించాలని రైతుల ఆందోళన - kurnool crime news
కర్నూలు జిల్లా రామదుర్గంలో వేర్హౌస్ గోడౌన్ యాజమాని ప్రహ్లాద శెట్టి అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే తమ డబ్బు చెలించిన తర్వాతే అత్యక్రియలు నిర్వహించుకోవాలని మృతుని ఇంటి ముందు రైతులు ఆందోళన చెపట్టారు.
వేర్హౌస్ గోడౌన్ యజమాని మృతి.. డబ్బు చెల్లించాలని రైతుల ఆందోళన