ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంది పంటకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు - అగ్నికి ఆహుతైన కందిపంట న్యూస్

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపల గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కంది పంటకు నిప్పంటించారు. నష్టపోయిన తమను.. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

Burnt soybean crop in Banaganapalle zone of Kurnool district
కంది పంటకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

By

Published : Jan 26, 2021, 7:49 AM IST

గుర్తు తెలియని కొందరు వ్యక్తులు.. కంది పంటకు నిప్పు పెట్టడంతో కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపల గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి.. తీవ్రంగా నష్టపోయాడు. తనకున్న నాలుగు ఎకరాల పొలంలో ఆయన కంది పంటను వేశాడు. రెండు రోజుల్లో పంటను కోసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలో... గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పంటించడంతో.. పూర్తిగా దగ్ధమయింది. సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లింది. చేతికి అందివచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడం.. రైతుకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ప్రభుత్వం తమను ఆదుకుని పరిహారం చెల్లించాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details