ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దసరాకు కర్రల సమరం... 11 గ్రామాల ప్రజల రణరంగం

దసరా వచ్చిందంటే అక్కడి భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవ విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రణరంగమే సృష్టిస్తారు. కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సమయం ఆసన్నమైంది.

దసరాకు కర్రల సమరం... 11 గ్రామాల ప్రజల రణరంగం

By

Published : Oct 7, 2019, 11:57 PM IST

Updated : Oct 8, 2019, 3:11 AM IST

దసరాకు కర్రల సమరం... 11 గ్రామాల ప్రజల రణరంగం

ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాలు సిద్ధమయ్యాయి. ఏటా దసరా పర్వదినం నాడు జరిగే ఈ ఆచార రణరంగానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండలో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కొత్తపేట, నెరణికి తండా గ్రామాలు ఒకవైపు...అరికెర, ఆలూరు, బిలేహల్, ఎల్లార్తి, సులువాయి, విరూపాపురం, నిత్రవట్టి గ్రామాలు మరోవైపు వర్గాలుగా విడిపోయి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో తలపడతారు. ఈ సమరానికి బన్ని ఉత్సవంగానూ పేరుంది.

11 గ్రామాలు...రెండుగా చీలిపోయి

కొంతమంది కర్రలు, మరికొందరు దివిటీలు చేతబట్టి కొండల మధ్య నుంచి అర్థరాత్రి వేళ దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయలుదేరతారు. ఈ సమయంలో ఉత్సవ విగ్రహాలను దక్కించుకొనేందుకు పరిసర గ్రామాల ప్రజలు పోటీపడతారు. మండలంలోని 11 గ్రామాల ప్రజలు రెండుగా విడిపోయి కర్రలతో పరస్పరం తలపడతారు. రక్తం చిందినా లెక్క చేయకుండా.. భక్తిని ప్రదర్శిస్తారు.

ఆచారం పేరిట.. సాగుతున్న రక్తపాతం

దేవరగట్టు కర్రల సమరం తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఆచారం పేరిట ఏటా ఈ రక్తపాతం సాగుతూనే ఉంది. కొంతమంది కర్రలకు ఇనుప రింగులు తొడిగి బన్ని ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలు పగిలి, గాయాల తీవ్రత పెరుగుతుంటాయి. ప్రాణపాయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదీ చూడండి: అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధం

Last Updated : Oct 8, 2019, 3:11 AM IST

ABOUT THE AUTHOR

...view details