ఇసుక సమస్యను పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మిక శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం ఎదుట భవన కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ ధర్నా చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రతి కార్మికుడికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సిమెంట్ ధరలను తగ్గించాలన్నారు. ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసుకున్న కార్మికుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలన్నారు.
'భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి'
కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు భౌతికదూరం పాటిస్తూ ధర్నా నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో ప్రతి కార్మికుడికి పదివేల రుపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి