తుంగభద్ర నదీ పుష్కరాల దృష్ట్యా.. ఘాట్‌ల నిర్మాణానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భూమిపూజ చేశారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత గురుజాల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు తుంగభద్ర పుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు. పుష్కర స్నానాల కోసం వచ్చేవారికి ఈ-టికెట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. జల్లు స్నానాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నామని వివరించారు.
మార్గదర్శకాల మేరకు పుష్కరాలు నిర్వహణ: మంత్రి బుగ్గన - tungabhadra river pushkar latest news
అనంతపురం జిల్లా మంత్రాలయం స్వామి మఠాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. తుంగభద్ర పుష్కరాలను నిర్వహణకు జిల్లాలోని ఘాట్ల నిర్మాణాలు, రహదారుల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
తుంగభద్ర నదీ పుష్కరాలను వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తామన్న మంత్రి బుగ్గన