కర్నూలు జిల్లా వేల్పనూరు గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆత్మకూరు మార్కెట్ యార్డ్‌లోని పోలింగ్ కేంద్రంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఓటు వేశారు.
శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఓటు - శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు.
![శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఓటు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2969869-thumbnail-3x2-budda.jpg)
ఓటు హక్కు వినియోగించుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలంలో ఓటు హక్కు వినియోగించుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం నియోజకవర్గంలో లక్షా ఎనభై వేల మంది వరకూ ఓటర్లున్నారు. నియోజకవర్గంలో మొత్తం 224 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు.
ఇటు చూడండి :కడప జిల్లాలో ఉద్రిక్తం.. వృద్ధుల ఓట్లు వేసిన సెక్టోరల్ అధికారి